‘అన్స్టాపబుల్’ బాలయ్య… స్టార్టింగ్ లోనే అల్లు అరవింద్ పై సెటైర్

పాపులర్ టాలీవుడ్ ఓటిటి ‘ఆహా’ బాలయ్యతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో లాంచ్ అయ్యింది. కొద్దిసేపటి క్రిత్రం ప్రారంభమైన ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’ షోలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి, ఆహా ఓటిటి మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర్ కు, నా అభిమానులకు, ప్రేమ, అభిమానం, వాత్సల్యం అందిస్తున్న తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళకు నమస్కారం. అన్ని జోనర్ల సినిమాలను ఆదరిస్తున్న ఘనత తెలుగు ప్రేక్షకులకే చెందుతుంది. ‘ఆహా’ అల్లు అరవింద్ మానసిక పుత్రిక. ఆరితేరిన ఎన్నో దిగ్గజ ఓటిటి సంస్థలు ఉండగా, దీన్ని ప్రారంభించి నిలబెట్టిన ఘనుడు అల్లు అరవింద్….

Read Also : అది సంస్కారం అంటే… బాలయ్యపై మోహన్ బాబు ప్రశంసలు

పొట్టివాళ్లకు పుట్టెడు బుద్ధులు అని అంటారు. ఆయనతో ఎందుకు అంత సన్నిహితంగా మాట్లాడతానంటే… అల్లు అరవింద్ గారికి మా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ది గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారి అబ్బాయి… నా చిన్న చిన్నప్పుడు మద్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లోకి నేరుగా వెళ్లి, మా అమ్మగారితో టీ పెట్టించుకుని, బండోడికి ఏమన్నా ఉన్నాయా ? మోయడానికి ? అనే వారు. అలాంటి చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్య గారికి మాత్రమే ఉంది” అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

-Advertisement-'అన్స్టాపబుల్' బాలయ్య… స్టార్టింగ్ లోనే అల్లు అరవింద్ పై సెటైర్

Related Articles

Latest Articles