నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి రికార్డు బ్రేకింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. ఈ సినిమాపై విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా కురిశాయి. థియేటర్లలో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఓటిటి విడుదలకు సిద్ధమవుతోంది. ‘లవ్ స్టోరీ’ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 22 నుండి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా చూడని వారు, మళ్ళీ మళ్ళీ ‘లవ్ స్టోరీ’ని వీక్షించాలనుకునే ప్రేక్షకుల కోసం ఆహాలో అందుబాటులోకి వస్తుంది.
Read Also : ‘మా’ వివాదంలో కొత్త కోణం… రంగంలోకి పోలీసులు
‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న వెండితెరపైకి వచ్చింది. ఈ చిత్రం వచ్చి సరిగ్గా నాలుగు వారాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఓటిటిలో విడుదలకు సిద్ధమయ్యింది ‘లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సామాజిక అంశాన్ని కీలకంగా చేసుకుని తెరకెక్కించిన ఈ ‘లవ్ స్టోరీ’ ఓటిటిలో విడుదల కానుందన్న విషయాన్నీ ప్రకటిస్తూ ఓ కొత్త ట్రైలర్ తో పాటు పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్.