తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోడలు, ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఉదయనిధి ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకోబోతోంది. ఇప్పటికే యూనిక్ స్టోరీ లైన్ తో ‘వనక్కమ్ చెన్నయ్’, ‘కాళీ’ చిత్రాలను కృతిక తెర కెక్కించింది. ఇప్పుడు కాళిదాస్ జయరాం, తన్య రవిచంద్రన్ జంటగా మూడో చిత్రం మొదలుపెట్ట బోతోంది. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పెంటెల సాగర్ దీనిని నిర్మించబోతున్నాడు. ఇదో జర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని, ఆ ప్రయాణం కధలో అంతర్భాగంగా సాగుతుందని కృతిక తెలిపారు. రిచర్డ్ ఎం. నాధన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.