NTR@100Years: ‘బింబిసార’ రాయల్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీయార్…. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుగు వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. ఈ మే 28న ఆయన శత జయంతి ప్రారంభం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు.. ప్రపంచంలోని తెలుగువారందరూ ఆ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read
‘బింబిసార’ పోస్టర్‌ను గమనిస్తే అందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ శతజయంతి విషెష్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బింబిసారలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చుతున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
-
Revenge Action Thriller: ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ మలయాళ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్.. యాక్టింగ్ ఇరగదీసిన జోజు జార్జ్
-
Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
-
Fatima Sana: సెమీఫైనల్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన పాకిస్థాన్ కెప్టెన్.!
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!