అద్దెకుండే కాలేజీ కుర్రాళ్లతో భార్య ఎఫైర్.. భర్తకి తెలిసి ఏంచేశాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం ఒక పెనుభూతం.. ఒక్కసారి మెదడులో అనుమానమొచ్చింది అంటే అది చచ్చేవరకు పోదు. ఇక అందులోను భార్యపై అనుమానం వస్తే ఆ భర్తకు మనశ్శాంతీ దొరకదు. ఆ అనుమానంతోనే ఎంతోమంది కిరాతకంగా మారుతున్నారు. తాజాగా భార్యపై ఉన్న అనుమానం ఒక భర్తను హంతకుడిగా మార్చింది. భార్య వేరేవాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించిన భర్త, భార్యను అతి దారుణంగా చంపిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. ప్రయాగ్ రాజ్‌కు చెందిన బాల్ శ్యామ్ అనే వ్యక్తి భార్య రష్మీ యాదవ్ తో కలిసి నివసిస్తున్నాడు. వారిది రెండంతస్తుల బిల్డింగ్ కావడంతో రెండో అంతస్థులో వారు ఉండి .. మొదటి అంతస్థును అద్దెకు ఇచ్చేవారు. ఇక ఇటీవల కింద పోర్షన్ లో ఉన్న ఫ్యామిలీ ఖాళీ చేయడంతో ఆ ఇంటిని కొందరు కాలేజీ కుర్రాళ్లకు అద్దెకిచ్చారు. అద్దెకు వచ్చిన కుర్రాళ్లు బాల్ శ్యామ్ భార్య రష్మీ యాదవ్ తో చనువుగా మాట్లాడేవారు. దీంతో బాల్ శ్యామ్ కి భార్యపై అనుమానం వచ్చింది.
Also Read
ఆమె వారితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం కూడా భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో కోపోద్రిక్తుడైన బాల్ శ్యామ్ భార్య రష్మీని పక్కనే ఉన్న రాడ్డుతో తలపై బాది దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి బాల్ శ్యామ్‌పై కేసు నమోదు చేయడంతోపాటు అతడిని జైలుకు తరలించారు.
తాజావార్తలు
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!