ఐపీఎల్ 2021 లో ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ కాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది, ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్ బ్యాటింగ్ తీసుకున్నాడు. దాంతో మొదట బౌలింగ్ చేయనుంది హైదరాబాద్. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిన సన్‌రైజర్స్ గత మ్యాచ్ లో విజయం సాధించి గెలుపుబాటలోకి వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా గెలిచి ఆ బాటలోనే కొనసాగాలని చూస్తుంది. చూడాలి మరి ఆ జట్టు ఈ మ్యాచ్ లో ఏం చేస్తుంది అనేది.
హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (c), జానీ బెయిర్‌స్టో (w), కేన్ విలియమ్సన్, విరాట్ సింగ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్
ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), హెట్మియర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్