ఈరోజు మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య డబుల్ హెడర్ సందర్బంగా రెండో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ తీసుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ తో వచ్చిన యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12) ఆకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన గేల్(13) కూడా త్వరగా ఔట్ కావడంతో ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలన్(26) మయాంక్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేసాడు. అయితే మలన్ ఔట్ అయిన తర్వాత అప్పటివరకు నెమ్మదిగా ఆడిన మయాంక్ హిట్టింగ్ ప్రారంభించాడు. చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచినా మయాంక్ 58 బంతుల్లో 99 పరుగులు చేసి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. దాంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఢిల్లీ 167 పరుగులు చేయాలి. అయితే గత మ్యాచ్ లో బెంగళూరును 150 పరుగులలోపే కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్ లో ఏం చేస్తారు అనేది చూడలి.