కలవరపెడుతోన్న కరోనా.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టిస్తోంది.. తొలిసారి రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల మార్క్‌ను కూడా దాటేసింది.. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.. కోవిడ్ కేసులకు హాట్ స్పాట్‌గా మారిపోయింది.. దీంతో.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా పరిస్థితులు, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించిన సీఎం కేజ్రీవాల్.. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలో ప్రస్తుతం 5 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, బెడ్స్ కొరత లేదని తెలిపారు. ఈ విషయంలో మీడియా కూడా సంయమనం పాటించాలని, ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దన్నారు. సినిమా హాల్‌లో సీటింగ్‌ను 30 శాతానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఢిల్లీ సీఎం… మాల్స్, జిమ్స్, ఆడిటోరియం, స్పా మూసివేయాలని ఆదేశించిన ఆయన.. విమానయాన, రైల్వే ప్రయాణికులు కచ్చితంగా టికెట్స్ చూపించాలన్నారు. వివాహాలు చేసుకునే వారికి కర్ఫ్యూ పాస్‌లు జారీ చేస్తామని తెలిపారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం.. ఢిల్లీ సర్కార్‌కు నిర్ణయాన్ని వదిలేయడంతో.. కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్.
Also Read
తాజావార్తలు
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
-
Mercedes-Benz AMG E 53: మెర్సిడెస్ బెంజ్ AMG E 53 విడుదల.. 3.8 సెకన్లలో 100 kmph స్పీడ్.. ధర ఎంతంటే?
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!