కరోనా నియంత్రణ పై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ నియంత్రణ పై సమీక్షలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి. అలాగే ఎంప్యానెల్ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి అని తెలిపారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలి. టెంపరరీ ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలి అని తెలిపారు. కోవిడ్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. కోవిడ్ ఆస్పత్రుల వద్దనే కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. తాత్కాలికంగా హ్యాంగర్లలో అన్ని వసతులతో సీసీసీలు ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఆస్పత్రుల వైద్యులు ఆ సీసీసీలో సేవలందిస్తారు అని అన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో క్వాలిటీ ఫుడ్, శానిటేషన్, ఆక్సీజన్, మెడికల్ కేర్, వైద్యుల అందుబాటు.. ఈ అయిదూ తప్పనిసరి ఉండాలి. తగినంత ఆక్సీజన్ సరఫరా, నిల్వ కోసం చర్యలు చేపట్టండి. కేంద్రం కేటాయింపుతో పాటు, ప్రత్యామ్నాయం పైనా దృష్టి సారించండి. టీచింగ్ ఆస్పత్రుల వద్ద 10 కెఎల్, ఇతర ఆస్పత్రుల వద్ద 1కెఎల్ ఆక్సీజన్ నిల్వ ఉండాలి. వీలైనంత త్వరగా ఈ ఏర్పాట్లు చేయండి అని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!