తెలంగాణ ప్రజలు ఆందోళనలో ఉన్నారు అని భట్టి విక్రమార్క అన్నారు. ఏడాది నుండి మేము చెప్పినవి జరుగుతున్నాయి. కానీ మీరు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. వీళ్ళు… వాళ్ళు అని కాదు..అందరూ కరోనా భారిన పడ్డారు. ఆరోగ్య శ్రీ లో చేర్చండి కరోనా వైద్యాన్ని అని చెప్పిన ఆయన కార్పొరేటర్ ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్ లు ప్రభుత్వం అధీనంలో ఉంచండి అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కి బుద్ది లేదు. ఆక్సిజన్ కూడా సరఫరా చేసుకునే పరిస్థితి లో లేదు. టెస్టుల కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వస్తుంది. వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. జనం సచ్చినా పరవాలేదు… అధాయమే ముఖ్యం అనే రీతిలో ప్రభుత్వం ఉంది అని అన్నారు. ఆక్సిజన్ లేదనే నెపం కేంద్రం మీద నిందలు ఎందుకు. మీరేం చేస్తున్నారూ.. ఏర్పాటు చేసుకోవాలి కదా… కానీ బాధ్యత లేకుండా పోయింది సర్కారు కి అని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనపడకుండా వాస్తవాలు బయట పెట్టడం లేదు ప్రభుత్వం అని తెలిపారు.