కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తింపు ఒట్టిమాటే : అయ్యన్నపాత్రుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతి ఆస్పత్రిలో మరణాలు సంభవిస్తున్నాయి. సిటింగ్ జడ్జి చేత విచారణ చేసి, వాస్తవాలను ప్రజల ముందుంచాలి అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. పచ్చి అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి… 30 మంది చనిపోతే 11 మంది అని చెప్పడం దారుణం. వాస్తవాలు చెప్పేవారిని బెదిరించి, అసత్యాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి పిచ్చి చేష్టలు మానాలి.. వాస్తవాలు ఒప్పుకోండి. కళ్లు తెరిచి ప్రజలను కాపాడటానికి ప్రయత్నించండి. కరోనా వల్ల చనిపోయిన 9వేల మందివి ప్రభుత్వ హత్యలే. దీనిపై సీఎం, ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేయాలి. ప్రైవేటు అంబులెన్స్ లు దోపిడీకి పాల్పడుతున్నారు… అధికారులు చర్యలు తీసుకోవాలి. బుల్లెట్ ఫ్రూఫ్ కారులు కొనడంలో వున్న శ్రద్ద… కరోనా పై లేదు. ఆస్పత్రిలో సిబ్బందికి మాస్క్ లు, కిట్లు ఏర్పాటు చేయాలి. కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తింపు ఒట్టిమాటే అన్నారు. రేషన్ వేన్లలో మందు సరఫరా చేస్తే బావుంటుందేమో సీఎం ఆలోచిస్తే బావుంటుంది. అధికార పార్టీ నాయకులు ఇసుక దోపీడీ పాల్పడుతున్నా… అధికారులు పట్టించుకోలేదు. దొంగతనాలను నిలువరించాల్సిన నాతవరం పోలీసులు.. వారికి సహకరిస్తున్నారు అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!