టాలెంటెడ్ బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేశాడు. సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా దీపికా, అనన్య పాండే ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. అయితే, శకున్ బత్రా సినిమాలో మరో హీరో కూడా అవసరం. ఆయన సినిమా రెండు యువ జంటల మధ్య సంబంధం ఆధారంగా నడవబోతోందట. అందుకే, దీపికాకి జతగా సిద్ధాంత్ చతుర్వేదిని ఎంపిక చేశారు. అనన్యతో రొమాన్స్ చేయాల్సిన పాత్రకి అవినాశ్ తివారీ లాంటి యంగ్ యాక్టర్స్ పేర్లు వినిపించాయి. కానీ, చివరకు ధర్మ ప్రొడక్షన్స్ ఫ్యామిలీ డ్రామాలో లక్కీ ఛాన్స్ కొత్త కథానాయకుడు ధైర్య కర్వాను వరించింది.
అసలు శకున్ బత్రా మూవీలో అనన్యతో పాటూ తెరపై ఇషాన్ కట్టర్ కనిపిస్తాడని అంతా భావించారు. వారిద్దరి మధ్యా ప్రస్తుతం రియల్ లైఫ్ లవ్ ఎఫైర్ కూడా కొనసాగుతోంది. కానీ, ‘ఖాళీ పీలీ’ మూవీలో అనన్యతో రొమాన్స్ చేసిన ఇషాన్ కి సెకండ్ ఛాన్స్ దక్కలేదు. అందుక్కారణం దీపికా అంటున్నారు ముంబై సినిమా జనం!
శకున్ బత్రా మొదట్లో తన లెటెస్ట్ సినిమాని రెండు యంగ్ కపుల్స్ మధ్య రిలేషన్ షిప్స్ ఆధారంగా తీద్దామనుకున్నాడట. అందుకే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య లాంటి యాక్టర్స్ ని సెలెక్ట్ చేశారు. ఇషాన్ కూడా యంగ్ స్టారే కాబట్టి అతనూ జాయిన్ అవుతాడని అన్నారు. కానీ, అనూహ్యంగా దీపిక కూడా మూవీలో భాగం అవ్వటంతో ఇషాన్ అవకాశానికి గండి పడిందట. కథలో భాగంగా అనన్య పాండే లవ్వర్ అయిన హీరోకి, ఫిట్ నెస్ ట్రైనర్ పాత్ర పోషిస్తోన్న దీపికతో ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఏర్పడుతుందట. అప్పుడు దీపిక కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయాల్సి వస్తుంది. మరి ఆమెతో ఇషాన్ లాంటి యంగ్ బాయ్ ని ఊహించుకోవటం కష్టమే కదా!
దీపిక పదుకొణే ఎంట్రీతో శకున్ బత్రా మూవీకి ఇషాన్ కట్టర్ దూరంగా ఉండాల్సి వచ్చిందంటున్నారు. అదే న్యూ హీరో ఇన్ బాలీవుడ్ … ధైర్య కర్వాకు వరంగా మారింది. క్రేజీ ఆఫర్ తో పాటూ ఒకే సినిమాలో అనన్య లాంటి యంగ్ బ్యూటీతో అఫీషియల్ రొమాన్స్, దీపిక లాంటి స్టార్ తో అన్ అఫీషియల్ రిలేషన్ రెండు దక్కాయి! చూడాలి మరి, ఇషాన్ కట్టర్ కి రియల్ లైఫ్ గాళ్ ఫ్రెండ్ అనన్యతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మళ్లీ ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో…
దీపిక వల్ల… బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేయలేకపోతోన్న అనన్య!
