పర్యావరణ పరిరక్షణ కు అమరరాజ కట్టుబడి ఉంది. వాటాదారుల ప్రయోజనాలు కాపాడటానికి అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కట్టుబడి ఉన్నాము.చిత్తూరు జిల్లాలోని కరకంబాడి, నూనె గుండ్ల పల్లి లో స్థాపింపబడ్డ అమరరాజ బ్యాటరీస్ లిమిటెడ్ ను మూసి వేయవలసిందిగా ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుండి ఆదేశాలు అందాయి. దేశ విదేశాలలో అతి కీలకమైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తూ సమాజ స్పూర్తి దాయక విలువలను సంస్థ ఎల్లప్పుడూ పాటిస్తూ ఉద్యోగుల, సమాజం, వాటాదారుల యొక్క ప్రయోజనాలని పరిరక్షిస్తూనే ఉంటాము.
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో మా యొక్క సరఫరాలకు ఎటువంటి అంతరాయం కలిగిన అది తీవ్ర నష్టాన్ని కలగ చేస్తుంది కాబట్టి మండలి ఆదేశాలపై వెంటనే చర్యలు ప్రారంభించింది. కంపెనీ ఆధారిత రంగాలు బ్యాటరీల సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. కంపెనీ సరఫరా చేస్తున్న ప్రధాన వినియోగదారులకు లోటు కలగకుండా చేయటానికి నియంత్రణా మండలి అధికారులతో చర్చలు సాగిస్తున్నాము. అనేక సంవత్సరాలుగా వివిధ వార్షిక / ద్వైవార్షిక పర్యావరణ ఆడిట్లు, ధ్రువపత్రాలు సంస్థ పొంది ఉంది. భద్రత, పర్యావరణ రక్షణ లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకున్నాము. పర్యావరణం, ఆరోగ్యం, భద్రత యొక్క అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాము.
అమరరాజ సంస్థ పర్యావరణ పరిరక్చన చర్యలు పాటిస్తూ, వివిధ రకాలైన కార్యక్రమాలు, సంస్థ ప్రమాణాలు, చట్ట ప్రకారం చేయవలసిన కార్యక్రమాలు, సంస్థాగతంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలుని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులకి తెలియచేస్తూనే వచ్చింది. వాటాదారులని దృష్టిలో పెట్టుకొని సంతృప్తికరమైన పరిణామం లభిస్తుంది అని ఆశిస్తున్నాము అని తెలిపింది.