ఆ గ్యాప్ లో “ఏజెంట్” దర్శకుడితో నితిన్ మూవీ

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తానంటున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. కెరీర్ ప్రారంభం నుంచి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ, సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. వరుసగా స్టార్ హీరోలకు దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవితో “సైరా” అనిపించినా డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఒక స్పై థ్రిల్లర్ కథాంశాన్ని తీసుకుని అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్నాడు. అక్కినేని అఖిల్ ను “ఏజెంట్”గా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తవుతుంది.

Read Also : సోనూసూద్ డేంజరస్ స్టంట్స్.. వీడియో వైరల్

ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ మూవీ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో “యథా కాలమ్ తథా వ్యవహారమ్…” అంటూ ఒక గన్ ను, హైదరాబాద్ లోని చార్మినార్, సైబర్ టవర్ ను చూపించడం చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని భావిస్తున్నారు. పవన్ తో సినిమాకు చాలా టైం ఉండడంతో సురేందర్ రెడ్డి మరో నిర్ణయం తీసుకున్నాడట.

పవన్ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ముందు మరో చిన్న చిత్రాన్ని ప్లాన్ చేసారు. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ యంగ్ హీరో నితిన్ కోసం స్క్రిప్ట్ రాశారు. నితిన్ కూడా కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌తో పాటు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా నిర్మిస్తారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఇది రొమాంటిక్ కామెడీ అని, ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు ఖరారు అయ్యారని సమాచారం.

Related Articles

Latest Articles

-Advertisement-