ఆవుపాలు, గేదెపాలను అధికంగా తీసుకుంటుంటారు. అయితే, కొంతమందికి ఈ పాలు పడవు. ఇలాంటి వారు సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ వంటివి తీసుకుంటు ఉంటారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఆలూ మిల్క్ అందుబాటులోకి వచ్చాయి. స్వీడన్‌కు చెందిన డగ్ అనే కంపెనీ ఆలూ మిల్క్‌ను యూకేలో ప్రవేశపెట్టింది. ఈ ఆలూ మిల్క్‌లో వివిధ విటమిన్స్‌తో పాటు రుచికరంగా కూడా ఉండటంతో వీటిని తాగేందుకు యూకే వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా ఆవులు, గేదెలు వంటి జంతువుల నుంచి లభించే పాలల్లో లాక్టోజ్ ఉంటుంది.
Read: Shocking Revenge : కోతిపై పగపట్టిన ఆ కాకులు… ఏం చేశాయంటే…
కానీ, ఈ ఆలూ పాలలో లాక్టోజ్ ఉండదు. దీంతో శాఖాహారులు ఆలూ పాల కోసం ఎగబడుతున్నారు. అంతేకారు, ఆలూ పాల ఖరీదు లీటర్ రూ. 170 మాత్రమే ఉండటంతో పెద్ద సంఖ్యలో లండన్ వాసులు కొనుగోలు చేస్తున్నారు. సోయాపాలలో లభించే ప్రోటీన్ల కన్నా నాలుగు రెట్లు అధికంగా ఆలూ పాలల్లో ప్రోటీన్లు లభిస్తాయి.