బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు.. వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ..హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో డైరక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా `సౌండ్ పార్టీ` టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది..
టీజర్ లాంచ్ అనంతరం సంపత్ నంది మాట్లాడుతూ..”నేను కూడా గతంలో కొన్ని చిత్రాలకు సమర్పకుడుగా వ్యవహరించాను. అదే బాటలో జయశంకర్ ఈ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ ట్రెడిషన్ ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా. `సౌండ్ పార్టీ` టీజర్ బావుంది. అలాగే మోహిత్ చేసిన మ్యూజిక్ కూడా జనాలకు నచ్చుతుంది. ఈ చిత్రం మరో జాతిరత్నాలు సినిమాలా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. వీజే సన్నికి ఇది మంచి హిట్ సినిమా అవుతుంది. అందరూ చేతిలో సెల్ ఫోన్, సిగరెట్ పట్టుకుని తిరుగుతుంటారు జయశంకర్ మాత్ర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటాడు. ఈ క్యాలిటీ నచ్చి `పేపర్ బాయ్` సినిమా డైరక్షన్ చేసే అవకాశం ఇచ్చాను. ఈ సౌండ్ పార్టీ సినిమా అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా అని అన్నారు..
అలాగే..శివన్నారాయణ మాట్లాడుతూ.” సంజయ్ నన్ను ఊహించుకుని 2016లోనే ఈ కథ రాసుకోవడం చాలా సంతోషం. అలాగే సంజయ్ ని ఎంకరేజ్ చేస్తున్న జయశంకర్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఇద్దరూ బాపూ-రమణ ల్లా మంచి మిత్రులు. ప్రతిది ఇద్దరూ డిస్కష్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. జయశంకర్ గారు ఈ సినిమాకు బ్యాక్ బోన్. సన్నితో సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇంత మంచి సినిమాలో నేను కూడా పార్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు.
హీరో వీజే సన్ని మాట్లాడుతూ.. షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాము. జయశంకర్ సపోర్ట్ తో సంజయ్ సినిమా చాలా బాగా చేశాడు. శివన్నారాయణ గారు నేను తండ్రికొడుకులుగా నటించాం. సినిమా అంతా ఇద్దరం ఫుల్ గా నవ్విస్తాం. మోహిత్ అద్భతుమైన మ్యూజిక్ ఇచ్చాడు. అందరూ ఫ్యామిలీతో వెళ్లి మా సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు..
దర్శకుడు సంజయ్ శేరి మాట్లాడుతూ.” మా టీజర్ లాంచ్ చేయడానికి వచ్చిన సంపత్ నంది గారికి కృతజ్ఞతలు. మనం బాహుబలి లాంటి కథ రాసుకున్నా మన వెనకాల ఒక బలం ఉండాలి. అలాంటి బలమే జయశంకర్ అన్న. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. ఇక సౌండ్ పార్టీ మరో జాతిరత్నాలు రేంజ్ లో ఉండబోతుంది. ముఖ్యంగా సినిమాలో సన్నీ, శివన్నారాయణ గారి పాత్రలు విపరీతంగా నవ్విస్తాయని చెప్పుకొచ్చారు..
సింగర్ శ్రీరామ్ చంద్ర మాట్లాడుతూ.. అందరితో కలిసి పోయే వ్యక్తిత్వం సన్నిది. తను మంచి సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు. సౌండ్ పార్టీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అని అన్నారు..
టైటిల్ కు తగ్గట్లే సన్నీ పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది..