బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఆయనకు అభిమానులు ఉన్నారు.. ఈ మధ్య ఆయన నటించిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. దాంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.. ఈ ఏడాది పఠాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షారుఖ్.. ఆ వెంటనే జవాన్ తో బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు.. బాలివుడ్ ను మళ్లీ నిలబెట్టాడు షారుఖ్.. ఈ ఏడాది చివర్లో డుంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
ఇకపోతే ఈయన బీటౌన్ సంపన్న వ్యక్తులలో ఒకరు.. మన్నత్ నివాసంతోపాటు.. ఆయన వద్ద ఖరీదైన వాచ్ లు, కార్లు, ఆస్తులు వరకు అన్ని విషయాలపై నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మారుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో షారుఖ్ ముందుంటారు. 6000 కోట్ల రూపాయల నికర విలువతో ఇండియాలోనే అత్యంత ధనికుడు.. అతని విలాసవంతమైన జీవనశైలిలో ఒక ప్రత్యేక అంశం తరచుగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఆయన వాచ్ కలెక్షన కూడా భారీగానే ఉంటుంది.. అందులో ఓ వాచ్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ మధ్య ఢిల్లీలో జరిగిన హ్యుందాయ్ ఈవెంట్‌లో షారుఖ్ ఖాన్ లగ్జరీపై ఖరీదైన వాచ్ కలెక్షన్స్ పై మరోసారి తన ఆసక్తిని చూపించారు. ఈ ఈవెంట్ భారతదేశంలో వైకల్యం ఉన్న వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి లక్ష్యంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు షారుఖ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెల్లటి చొక్కా, ఫ్యాషన్ బ్లూ బ్లేజర్, బూడిద రంగు ప్యాంటు ధరించి, సొగసైన బ్లూ ఏవియేటర్‌లు , అతని సిగ్నేచర్ పోనీ హెయిర్‌స్టైల్‌తో పాటు అందరిని ఆకట్టుకున్నాడు..పాటెక్ ఫిలిప్ వాచ్ ధరించాడు. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ వాచ్ ధర సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.రూ. 4.66 కోట్లు అని తెలుస్తోంది. ఇంతకు ముందు షారుఖ్ వాచ్, కార్ కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలు వైరలయ్యాయి.. ఇక సినిమాల విషయానికొస్తే.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ డిసెంబర్ 22న విడుదల కాబోతుంది..