NTV Telugu Site icon

Satpal Singh Arora: 81 ఏళ్ల విద్యార్థి.. ఈ వయసులో న్యాయశాస్త్రం చదవుతున్న తాతకు సలాం!

Satpal Singh

Satpal Singh

చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం.. చిత్తోర్‌గఢ్ నగరానికి చెందిన సత్పాల్ సింగ్ అరోరా 81 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈయన చిత్తోర్‌గఢ్ నగరంలోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన అడ్మిషన్ కోసం లా కాలేజీకి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా నేర్చుకోవాలనే తపించే ఆయనను కొనియాడారు. ఈ వయసులోనూ ఆయన రెగ్యులర్ గా లా కాలేజీకి వస్తున్నారు.

READ MORE: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి.. సీఎం ఆదేశం

సత్పాల్ సింగ్ లా చదవడానికి ముందు ఎంఏ పూర్తి చేశారు. చట్టం గురించి తెలుసుకోవాలనే తపనతో ప్రస్తుతం ఈ కోర్సు చేస్తున్నట్లు తెలిపారు. తనకు తెలిసిన MLV కాలేజీ లెక్చరర్ నుంచి సలహా తీసుకున్నారు. చదువుకు వయసు లేదని సత్పాల్ అరోరా చెప్పారు. మీరు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని.. డిగ్రీ పొందవచ్చన్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీ గుమ్మం తొక్కినట్లు తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఎల్‌ఎల్‌బీపైనే ఉందని, అయితే భవిష్యత్తులో పీహెచ్‌డీ కూడా చేయాలనుకుంటున్నానని సత్పాల్ చెప్పారు. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని వెల్లడించారు. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివినట్లు పేర్కొన్నారు.

READ MORE:Safety Tips: గీజర్‌ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?

Show comments