సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ఆ పార్టీనే కారణమా ?

టాలీవుడ్ యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన విషయం టాలీవుడ్ లో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం తేజ్ సేఫ్ గానే ఉన్నాడని నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకూ ఆయనకు వైద్యం చేస్తున్న అపోలో ఆసుపత్రి వైద్యులు రెండు హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. అయినప్పటికీ సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు ముందు చేసిన పనుల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

Read Also : సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్

ర్యాష్ డ్రైవింగ్, అత్యధిక స్పీడ్ లో వెళ్లడమే యాక్సిడెంట్ కు కారణమని ప్రాథమిక విచారణలో తేల్చిన పోలీసులు వీకెండ్ కావడంతో పార్టీ అటెండ్ కావడానికి సాయిధరమ్‌తేజ్ బయలుదేరినట్లుగా భావిస్తున్నారు. రెగ్యులర్ గా వీకెండ్ లలో యువ హీరోలతో పాటు సాయి ధరమ్ తేజ్ పార్టీలకు అటెండ్ అయ్యే వాడని సమాచారం. నటుడు సందీప్ కిషన్, వైవా హర్ష, నటుడు నరేష్ కుమారుడితో కలిసి రైడింగ్ వెళ్లేవాడట సాయి ధరమ్. ఐటీసీ కోహినూర్ వెనకాల సాయి ధరమ్ తేజ్ రెగ్యులర్ రైడ్ చేసేవాడని తెలుస్తోంది. అయితే రైడ్ కి వెళ్లే క్రమంలో బైక్ సూట్, నీప్యాడ్స్ ధరించే వాడు. కానీ నిన్న మాత్రం హెల్మెట్ మాత్రమే ధరించి బైక్ పై బయల్దేరాడు. ఒక వేళ బైక్ సూట్ వేసుకొని ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ యాక్సిడెంట్ కారణంగా మొత్తానికి స్వల్ప గాయాలతో బయట పడేవాడు సాయిధరమ్‌.

Related Articles

Latest Articles

-Advertisement-