Jailer: బ్లాక్ బస్టర్ జైలర్.. రజనీకి అదిరే గిఫ్ట్.. కార్ల షోరూమే ఇంటికొచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth gets BMW car from ‘Jailer’ producer as gift: ఇటీవల విడుదలైన జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కు సన్ పిక్చర్స్ యజమాని కళానిధి మారన్ బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ఆగస్టు 10న రిలీజైన రజనీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ జైలర్ సినిమా రూ.600 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం జైలర్ సినిమా భారీ హిట్‌గా నిలిచింది, ఈ విజయాన్ని రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు సినీ అభిమానులు సైతం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంలో జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ స్వయంగా నటుడు రజనీకాంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జైలర్ సినిమాకు గాను ఇప్పటికే రజనీకాంత్ కి రెమ్యునరేషన్ ఇవ్వగా ఇప్పుడు సినిమా లాభాల్లో వాటా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కళానిధి మారన్ నిన్న రజనీకాంత్‌కి చెక్ ఇస్తున్న ఫొటో సైతం వైరల్ అవుతోంది.
Also Read
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ఇక ఇదే క్రమలో జైలర్ భారీ విజయం సాధించిన సందర్భంగా నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్‌కు రూ.1.24 కోట్ల విలువైన లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ x7 కారును బహుమతిగా ఇచ్చారు. 1.24 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ x7 అలాగే బిఎమ్‌డబ్ల్యూ ఐ7 అనే రెండు లగ్జరీ కార్లలో ఎదో ఒకటి ఎంచుకోవాలని కళానిధి మారన్ రజనీని కోరారు. ఈ మేరకు ఇంటికే కార్లు కూడా తీసుకు రాగా ఆ సమయంలో రజనీకాంత్ BMW x7ని ఎంచుకున్నారు. ఇక జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్ల కలెక్షన్లు దాటేసి మరింత ముందుకు వెళ్తున్నాయి. ఇక ఇంతకుముందు జైలర్ 525 కోట్లు వసూలు చేసిందని సన్ పిచర్స్ అధికారికంగా వెల్లడించింది. ఒక్క తమిళనాడులోనే ఇప్పటివరకు రూ. 328 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాక్సాఫీస్ డేటా షేరింగ్ ప్లాట్‌ఫాం ఒకటి రిపోర్ట్ చేసింది. రజనీకాంత్ 2.0 తమిళంలో అత్యధికంగా రూ.615 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించగా, జైలర్ దానిని అధిగమిస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
#JailerSuccessCelebrations continue! Superstar @rajinikanth was shown various car models and Mr.Kalanithi Maran presented the key to a brand new BMW X7 which Superstar chose. pic.twitter.com/tI5BvqlRor
— Sun Pictures (@sunpictures) September 1, 2023
తాజావార్తలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?