Airtel Plans : మరోసారి వినియోగదారులకు షాక్.. పెరుగనున్న రీఛార్జ్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్‌టెల్ తన రీచార్జ్ ప్లాన్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్ విట్టల్.. దీన్ని రూ.200కు తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఇప్పటికీ ప్రీపెయిడ్ టారిఫ్ లు చాలా తక్కువ ధరలవద్దే ఉన్నాయంటూ, మొదటగా రూ.200కు అయినా తీసుకెళ్లాల్సి ఉందన్నారు గోపాల్ విట్టల్.
అంటే కనీసం 10 శాతానికి పైన, 20 శాతం వరకు (కొన్ని ప్యాక్ ల ధరలు) ధరలు పెంచే అవకాశం ఉంటుందని సమాచారం. గతేడాది నవంబర్‌లో ముందుగా టారిఫ్ లను పెంచుతున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించగా.. వొడాఫోన్ ఐడియా, జియో కూడ ధరలను పెంచేశాయి. ఇప్పుడు కూడా చార్జీల పెంపును ముందుగా ఎయిర్ టెల్ అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయాన్ని రూ.300-400కు తీసుకెళ్లాలన్నది ఎయిర్ టెల్ వ్యూహం. దీన్ని ఆ సంస్థ అధినేత సునీల్ మిట్టల్ ఏడాది క్రితమే ప్రకటించారు.
Also Read
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
- Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!