మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.. ఒక్క ఆచార్య తప్ప మిగిలిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా కలెక్షన్ల సునామిని సృష్టించింది.. ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు.. తాజాగా రిలీజ్ అయిన భోళాశంకర్ సినిమాలో ఓ పాట రిలీజ్ అయ్యింది.. ఆ పాటలో చిరు చాలా స్మార్ట్ గా అందంగా ఉన్నాడు.. ఇప్పుడు మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది..
ఓ పర్టిక్యులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఎంత బాగా కనిపించాలనుకున్నా ఎక్కడో ఓ చోట తేడా అయితే కొడుతుంది. కానీ ఈ విషయంలో చిరు మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత చిరుకు వయసైపోయిందనుకున్నారు. కానీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్సయ్యాక.. బరువు తగ్గి చాలా మారిపోయారు మెగాస్టార్. అప్పట్నుంచి సినిమాకు మరింత యంగ్ అవుతూనే ఉన్నారు.. భోళా శంకర్ సినిమాలోని లుక్ కోసం ఒక 20 ఏళ్లు తగ్గించుకున్నారు.. అంత స్మార్ట్ గా కనిపిస్తున్నారు..
గతేడాది ఆచార్య, గాడ్ ఫాదర్‌లో కాస్త బరువు పెరిగినట్లు కనిపించిన చిరు.. వాల్తేరు వీరయ్యతో మళ్లీ సెట్ అయిపోయారు. ఇప్పుడు భోళా శంకర్‌లో అయితే మరింత సన్నగా మారిపోయారు. ఆయన గ్లామర్ రోజురోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌లో ఉన్న చిరంజీవి.. రాగానే కళ్యాణ్ కృష్ణ తో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళానున్నారు..ఆ తర్వాత వశిష్ట దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారని సమాచారం.. ఏది ఏమైనా చిరు లుక్స్ మాత్రం కిర్రాక్ గా ఉన్నాయి.. ప్రస్తుతం స్మార్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న భోళాశంకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..