Boat Crash: బీహార్ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో గురువారం అర్థరాత్రి పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. హైటెన్షన్ లైన్ తగిలి ఇద్దరు వ్యక్తులు కాలిపోయారు. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. బోటులోని ఓ ప్రయాణికుడు మొండిగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటులోని చాలా మంది వ్యక్తులు సోన్‌పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పడవలో 16 మంది ఉన్నారు. ఇక…
బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో శిశువు జన్మించింది. ఆ పసికందు తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది.. అసాధారణంగా జన్మించిన ఆడశిశువును చూసేందుకు నర్సింగ్ హోమ్ కు జనం భారీగా తరలి వచ్చారు.
రాఖీ పండగ రోజున బీహార్‌లోని సారణ్ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. 25 ఏళ్ల మన్మోహన్ అనే యువకుడు పాములు పట్టడంలో నేర్పరి. తాను నివశించే చుట్టుపక్కల ప్రాంతాల్లో పాములు పట్టుతుంటాడు. అయితే, అందరిలా రాఖీ పండుగనే చేసుకుంటే ప్రత్యేకత ఏముంది అనుకున్నాడు. రెండు పాములకు రాఖీలు కట్టాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే రెండు పాములను పట్టుకున్నాడు. వాటి తోకలను పట్టుకొని పడగపై బొట్టు పెట్టాడు. అయితే, అందులో ఒకపాము మెల్లిగా కదులుతూ ముందుకు వచ్చింది. కానీ దానిని…