మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్ ఒక పెంపుడు కుక్క. దానికి వాళ్ళు మియా అని పేరు పెట్టారు. మియా ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్ తన కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు వచ్చాడు’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాజల్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే ఆమెకు డాగ్ ఫోబియా ఉంది.
Read Also : ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా
Also Read
- Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
- Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
ఆ కుక్క పిల్ల ఫోటోను షేర్ చేస్తూ కాజల్ “నా కుటుంబంలోని కొత్త సభ్యుడిని మీకు పరిచయం చేస్తాను. లిటిల్ మియా. నాకు చిన్నప్పటి నుండి కుక్కల భయం ఉందని నా సన్నిహితులకు తెలుసు. గౌతమ్ ఏమో పెంపుడు జంతువుల ప్రేమికుడు. పెంపుడు జంతువులతో పెరిగారు. జీవితం మనల్ని కలుపుకొని ఉండటానికి ప్రేమను పంచాలని బోధిస్తుంది. మియా చాలా సరదాగా, ముచ్చటగా, ఉత్సాహంతో మా జీవితాల్లోకి వచ్చింది. ఈ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి” అంటూ తనకు డాగ్ ఫోబియా అన్న విషయాన్నీ వెల్లడించింది. ఇక ఆమె భర్త గౌతమ్ “మొదటి బిడ్డ, చివరకు కాజల్ అగర్వాల్‌ని ఒప్పించింది. కుక్కపిల్ల మియాకు స్వాగతం” అంటూ మియా ఫోటోలను పోస్ట్ చేశారు.


తాజావార్తలు
-
Vivo T5 5G: భారత్ లో త్వరలో విడుదల కానున్న వివో టి5 5జి.. 3డి కర్వ్డ్ డిస్ప్లే, ఏఐ ఫీచర్స్
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
Brahmastra 2: ‘రామాయణం’ తర్వాత రణబీర్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?.. ద్విపాత్రాభినయంతో సిద్ధమవుతున్నాడా?
-
Myanmar Airstrike: బౌద్ధ మఠంపై మయన్మార్ సైన్యం వైమానిక దాడి.. 14 మంది మృతి
-
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!