‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

నిన్న హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన పరాజయం గురించి మాట్లాడారు. “మా ఎన్నికలు బాగా జరిగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు. తెలుగు వ్యక్తే ‘మా’ అధ్యక్షుడుగా కావాలనుకున్నారు. కానీ నాకు కళాకారుడుగా ఆత్మ గౌరవం ఉంది. అతిథిగా వచ్చాను.. అతిథిగానే ఉంటా. ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేస్తున్నాను” అని ప్రకటించారు. “21 ఏళ్ళు అయింది ‘మా’ మెంబర్ అయి, ‘మా’ కుటుంబంలో అందరూ ఒక్కటే అనే పదం అబద్ధం. ఓటమి జీర్ణించుకున్నా, అందుకే ఈ నిర్ణయం. ఇకపై మాలో భాగస్వామ్యంగా ఉండలేను” అంటూ ‘మా’ కార్డు చూపించారు. ఇక అసోసియేషన్ నుంచే బయటికి వచ్చాను కానీ తెలుగు సినిమా నుంచి బయటకు రాలేదు. సినిమాలు చేస్తూనే ఉంటాను. సభ్యులతో కలిసి నటిస్తాను. వారికి ఏం కావాలన్నా చేస్తాను. లోకల్, నాన్ లోకల్ ఎజెండాల మధ్య ఉండలేను. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు.

Read Also : హీరోలందరూ కలిసి ఉంటే అది జరగదు : చిరంజీవి

విష్ణుకు, మీకు 100 ఓట్ల తేడా వచ్చింది. ఆ 100 ఓట్ల అభిప్రాయాన్ని గౌరవిస్తారా? వాళ్ళతో కలిసి ఎలా పని చేస్తారు? అని ప్రశ్నించగా… వారి అభిప్రాయాన్ని గౌరవిస్తా.. అలాగే వారితో కలిసి పనిచేస్తా… వాళ్ళు వద్దంటారా ?’ అని అన్నారు. బెంగుళూరు రాజకీయాల్లో కూడా ఇలాంటి ఫలితమే వచ్చింది? ‘మా’ను వదిలేసినట్టుగా రాజకీయాలను కూడా వదిలేస్తారా ? అన్న ప్రశ్నకు “ఓడిపోయానని రాజకీయాలను వదిలేయలేదు కదా! అలాగే ‘మా’ను వదిలేస్తున్నా అంతేకాని తెలుగు సినిమాను కాదు ” అన్నారు. బండి సంజయ్ ట్వీట్ గురించి మాట్లాడుతూ “రాజకీయాలు ఎంటర్ అయ్యాయి. దానిని ఎలా చూస్తారు అన్నది మీ ఇష్టం. వాళ్ళు గెలిచిన వాళ్ళు ఒక్కటే. తుకుడా తుకుడా గ్యాంగ్, టెర్రరిస్ట్ అన్నారు. వాళ్ళు కూడా ‘మా’లో ఎన్నికయ్యారు కాబట్టే అక్కడ ఉండలేను. ‘మా’లో సభ్యత్వం లేని వాళ్ళను సినిమాల్లోకి తీసుకోవద్దు అనే నిబంధన ఉంది కదా ? అంటే “నా ప్రేక్షకులకు, దర్శకనిర్మాతలకు నన్ను దూరం చెయ్యని. ఇక నుంచి నా దగ్గర కార్డు లేదు. ఏం చేద్దాం. స్టూడియోకు వదలరా ? కార్డు ఉన్నా లేకపోయినా వదిలి తీరాలి” అని అన్నారు. ఆయన లైవ్ లో ఇంకా మాట్లాడుతున్నారు.

-Advertisement-'మా' సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా

Related Articles

Latest Articles