రూ.52 కోట్ల విలువైన అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను వేలానికి పెట్టినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఇంత ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ని కొనుగోలు చేసిన వ్యక్తి దానిని డెకరేషన్ కోసం ఎక్కడో ఉపయోగించారని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే దాన్ని కొన్న వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన క్రిప్టోకరెన్సీ వ్యాపారి జస్టిన్ సన్ ఈ కళాకృతిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.