కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత ఇంకా తగ్గలేదు. డెల్టావేరియంట్ కారణంగా ఇప్పటికే కోట్లాది మంది మహమ్మారి బారిన పడ్డారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా అమలు చేస్తుండటంతో కొంతవరకు తీవ్రత తగ్గిందని చెప్పుకోవాలి. కరోనాకు వ్యాక్సిన్‌తో పాటుగా ఇతర మార్గాల్లో కూడా మందులను తయారు చేస్తున్నారు. అలాంటి వాటిల్లో బయోగ్రీన్ రెమిడిస్ సంస్థ ఇమ్యూనిటి బూస్టింగ్ బిస్కెట్లను తయారు చేసింది.
Read: డైహార్డ్ ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖీ’ స్పెషల్ షో!
క్లినికల్ ట్రయల్స్‌లో ఈ బిస్కెట్లు మంచి రిజల్ట్ ఇచ్చాయని, క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న నెల రోజుల వ్యవధిలోనే అనుమతులు వచ్చాయని బయోగ్రీన్ రెమిడిస్ సంస్థ తెలిపింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఈ మెడిసిన్ తీసుకున్నవారిలో 88 శాతం మంది 7 రోజుల్లో, 12 శాతం మంది 10 రోజుల్లో కరనా నుంచి కోలుకున్నారని బయోగ్రీన్ రెమిడీస్ సంస్థ తెలియజేసింది.