“శాకుంతలం”లో బాలీవుడ్ నటుడు

ఇటీవల “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత అక్కినేని ఇప్పుడు “శాకుంతలం” అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. “శాకుంతలం” మహాభారతంలోని ఆది పర్వం, కాళిదాస్ “అభిజ్ఞాన శకుంతలం” ఆధారంగా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ కూడా “శాకుంతలం”లో భాగం కానున్నారట. ఆయన ఈ పౌరాణిక డ్రామాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు.

Read Also : చిరు సినిమాకు కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేసిందా ?

“శాకుంతలం” నిర్మాతలు కబీర్ బేడీ సినిమా తారాగణంతో ఉన్నాడన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిర్మాత నీలిమ గుణ.. కబీర్ బేడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో పని చేయడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు ఆమె “శాకుంతలం”ని కూడా ట్యాగ్ చేసింది. దీంతో ఈ సినిమాలో ఆయన నటిస్తున్నారు అనే విషయం కన్ఫామ్ అయ్యింది. “శాకుంతలం”లో దుర్వావ మహర్షి పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా ఈ చిత్రం భరత్ పాత్రలో నటిస్తోంది.

Related Articles

Latest Articles