టీవీలో ప్రతి నిమిషానికి డైరీ మిల్క్ యాడ్ వస్తుంది.. తియ్యని వేడుక చేసుకోవాలంటే డైరీ మిల్క్ ఉండాలి అంటూ.. ఆ కంపెనీ ఓ కస్టమర్‌కు చేదు అనుభావాన్ని ఇచ్చింది. క్యాడ్ బెరి డైరీ మిల్క్ కొన్న కస్టమర్‌కు చాక్లెట్ ఓపెన్ చేయగానే కదులుతున్న పురుగు కనిపించింది.. అది చూసి షాకైన అతను వెంటనే ఈ విషయం పై కంప్లైంట్ ఇచ్చాడు.. దాంతో ఈ విషయం కాస్త క్షణాల్లో వైరల్ అయ్యింది..
ఇటీవల హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్ కొని.. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ తినడం సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నిర్దారించింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి ఇటీవల ఇంటికి వెళ్తూ పిల్లల కోసమని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోని ఓ షాప్‌లో చాక్లెట్ కొన్నాడు..
ఇంటికి వెళ్లి పిల్లలకు దాన్ని ఇచ్చేందుకు కవర్ ను ఓపెన్ చెయ్యగా అందులో బ్రతికున్న ఒక పురుగు కనిపించింది.. అది కూరగాయల మీద పాకినట్లు పాకుతూ ఉంది.. దాన్ని చూసి రాబిన్ షాక్ కు గురయ్యాడు. వెంటనే మొబైల్ ఫోన్ తీసి వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటామని తెలిపాయి.. తాజాగా ఈ విషయం పై తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ నిర్దారించింది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని స్పష్టం చేసింది..
అంతేకాదు ఆ చాక్లేట్ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వార్మ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆక్ట్ 2006 ప్రకారం క్యాడ్‌బరీ రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ సురక్షితం కాదని నిర్ధారించారు.. సో పొరపాటును కూడా వాటిని తినకండి..
అప్డేట్:
క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ తినడం సురక్షితం కాదని నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ. https://t.co/QEN8EOd1hj pic.twitter.com/Kr8jDrqXWb
— Telugu Scribe (@TeluguScribe) February 28, 2024