NTV Telugu Site icon

అయ్యన్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన రోజా

ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడిక్కించాయి టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు.. సీఎం వైఎస్‌ జగన్‌, వైసీపీ సర్కార్‌, కొందరు మంత్రులను, డీజీపీని టార్గెట్‌ చేస్తూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై అధికారపార్టీ మండిపడుతోంది.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాన్ని ముట్టడించేందుకు కూడా ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు యత్నించాయి.. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. అయ్యన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నారు.. ఆయన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.. అయ్యన్న ఎమ్మేల్యే పదవి పీకేసారు.. మంత్రి పదవి పీకేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేసారు… లోకేష్ జెండా పదివి పీకేసారు… ఇంకా ఎమి పీకాలి అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు రోజా..

మరోవైపు.. కోడెల శివప్రసాద్‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకూండా చంద్రబాబు నాయుడు మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్నపాత్రుడు ఏమయ్యాడని ప్రశ్నించారు రోజా.. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో వైఎస్‌ జగన్‌ని చూసి నేర్చుకోవాని సూచించిన ఆమె.. సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలన్న ప్రతిపాదనలపై స్పందిస్తూ.. సినిమా టిక్కెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సీఎం జగన్‌ అమలుకు పూనుకుంటున్నారని తెలిపారు. కాగా, అయ్యన్నపాత్రుడు కామెంట్లపై వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఒంటికాలితో లేస్తున్నారు.. అయ్యన్న, చంద్రబాబు, టీడీపీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు వైసీపీ నేతలు.