Illusion Biryani: ప్రత్యేకమైన ‘బిర్యానీ’ ట్రై చేయాలనుకుంటున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వంటకాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఘుమ ఘుమలాడే బిర్యానిని టేస్ట్ చేయని వారు ఎవరు ఉంటారు. ఇందులోనూ అనేక వెరైటీలు ఉంటాయి. చాలా మంది తమ ఇష్టాలకు అనుగుణంగా పలు రకాల చికెన్ బిర్యానీ వెరైటీలను తింటుంటారు. అది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. బిర్యానీ ప్రియులు కచ్చితంగా ఆ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే, మీరు ఎప్పుడైన ‘ఇల్యూజన్ బిర్యానీ’ ట్రై చేశారా?. ఈ ప్రత్యేకమైన బిర్యానీ ఢిల్లీ కేఫ్‌లో వడ్డిస్తారు. దీనిని “ఖయాలీ పులావ్”,”మసాలా భాత్” అంటూ పేర్లు కూడాపెడుతున్నారు నెటిజన్లు.
Also Read: Baby boy sold: నవజాత శిశువును అమ్మేసిన తల్లి
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో భ్రమలకు కొత్తేమీ కాదు. దాదాపు ప్రతిరోజూ మనం ఏదో ఒక రకమైన ట్రిక్ లేదా భ్రమ ఆధారంగా వైరల్ పోస్ట్‌లను చూస్తాం. కొన్నిసార్లు వాటిని చూసి ఆశ్చర్యపోతాం. అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ హోటల్ లో బౌల్ లో బిర్యానీ మసాలాలు వేశాడో వ్యక్తి. బిర్యాలీలో వేసే అన్ని రకాల దినుసులు వేశాడు. అనంతరం దానికి మూత పెట్టి.. చేతిలో తీసుకుని కాసేపు మ్యాజిక్ చేశాడు. అది కాస్తా వేడి వేడి బిర్యానీగా బయటకొచ్చింది.
Also Read
ఒక వ్యక్తి బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల సాదా బియ్యం, సాధారణ బిర్యానీ మసాలాలు, వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్డు కలుపుతున్నట్లు వీడియో చూపిస్తుంది. అతను కొన్ని సెకన్ల పాటు కూజాను కదిలించాడు. అతను దానిని తెరిచి, దానిలోని పదార్థాలను ప్లేట్లోకి వడ్డించాడు. దాని నుండి బిర్యానీ లాంటి బియ్యం రావడం కనిపిస్తుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి ‘ఇల్యూజన్ బిర్యానీ’ అని పేరు పెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు వివిధ రకాలు స్పందిస్తున్నారు. ఈ రీల్‌కి ఇప్పటివరకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కొంతమంది వినియోగదారులు ఈ వంటకాన్ని ప్రదర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బిర్యానీ అని పిలవలేమని పేర్కొన్నారు. బియ్యం గింజలు ఇప్పుడు సాదాగా ఉండవు, మసాలా కారణంగా పసుపు రంగులో ఉంటాయి. అయితే అది ఎలా సాధ్యం? కామెంట్స్‌లో నెటిజన్లు తమ సిద్ధాంతాలను పంచుకున్నారు.
తాజావార్తలు
-
UP: డేటింగ్ యాప్‌తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!