Site icon NTV Telugu

కిలాడీ లేడీ… బాలుడిపై లైంగిక దాడి, రూ.16 లక్షల సొత్తు దోపిడీ

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడిపై యువతి లైంగిక దాడి చేయడమే కాకుండా అతడిని బెదిరించి రూ.16 లక్షల సొత్తును కాజేసింది. వివరాల్లోకి వెళ్తే… టోలిచౌకీలో నివాసం ఉంటున్న కుటుంబం ఇటీవల జూబ్లీహిల్స్‌కు మారింది. అయితే ఇల్లు సద్దుతున్న క్రమంలో 20 తులాల బంగారం కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో తల్లి 9వ తరగతి చదువుతున్న కుమారుడిని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఆ బంగారం తీసింది తానేనని బాలుడు చెప్పడంతో తల్లి ఆశ్చర్యపోయింది.

Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న ధరలు

అయితే ఆ బంగారాన్ని తండ్రి దగ్గర బంధువైన యువతికి ఇచ్చానని బాలుడు వెల్లడించాడు. సదరు యువతి తాను చదువుకునే పాఠశాలకు వచ్చి తనను ఓ లాడ్జీకి తీసుకువెళ్లిందని.. అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడిందని వివరించాడు. ఆ సమయంలో మాజీ ప్రియుడితో కలిసి వీడియో తీసిందని.. ఆ తర్వాత ఆ వీడియో చూపించి బెదిరించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 20 తులాల బంగారంతో పాటు రూ.లక్షల నగదు ఇచ్చానని బాలుడు తెలిపాడు. దీంతో ఈ విషయంపై బాలుడి తల్లి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిపై లైంగిక దాడికి పాల్పడిన యువతిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరింది. కాగా మూడేళ్ల క్రితం ఈ ఘటన జరగ్గా… పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Exit mobile version