* నేడు ప్రజాభవన్ లో 320 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
* నేడు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని పిటిషన్.. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశ పెడతారన్న కోర్టు.. చర్యలు ఎప్పుడు తీసుకుంటారనే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం..
* నేడు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. 70 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి..
* నేడు ఇచ్చంపల్లి- కావేరి నది అనుసంధానంపై కీలక సమావేశం.. హైదరాబాద్ లోని జలసౌధలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న మీటింగ్.. ప్రాజెక్ట్ డీపీఆర్ ను రాష్ట్రాలకు అందజేసిన కేంద్రం.. సమావేశంపై ఇంజినీర్లకు మంత్రి ఉత్తమ్ సూచనలు..
* నేటితో ముగియనున్న సీపీఐ రాష్ట్ర మహాసభలు.. సాయంత్రం తెలంగాణ కొత్త కార్యవర్గం ఎన్నిక.. కూనంనేనిని రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగించే అవకాశం..
* నేటి నుంచి తెలంగాణలో ఉపాధ్యాయుల ప్రమోషన్ ప్రక్రియ ప్రారంభం.. 2,24 స్కూల్ అసిస్టెంట్స్, 640 ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులు ప్రమోషన్ ద్వారా భర్తీ..
* నేడు తెలంగాణ బంద్.. మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ.. బంద్ కు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చిన తెలంగాణ వ్యాపారులు..
* నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ.. పలు ప్రాజెక్టులకు, రాష్టానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్న సీఎం.. మధ్యాహ్నం 3.15కి నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియాతో సమావేశం.. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
* నేడు పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించిన చీరల పంపిణీ.. శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా పూజ అనంతరం మహిళలకు కానుక..
* నేడు విశాఖపట్నంలోని జీవీఎంసీ సర్వసభ్య సమావేశం.. లులూ మాల్ భూ కేటాయింపులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐలపై విపక్షాలు అభ్యంతరాలు లేవనెత్తే అవకాశ..
* నేడు ఏపీలో డీఎస్సీ-2025 మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యర్థుల స్కోర్ కార్డుల పరిశీలన తర్వాత.. టెట్ మార్కులు సవరించుకునేందుకు ఆఖరి అవకాశం..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లన్నీ నిండి వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..
* నేటి నుంచి సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం.. 22.5 శాతం వేతన పెంపునకు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఆమోదం.. మొదటి ఏడాది 12.5 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంపు..
* నేడు పశ్చిమ బెంగాల్, బీహార్ లో ప్రధాని మోడీ పర్యటన.. కోల్ కతాలో మెట్రో రైలు ప్రారంభించనున్న ప్రధాని.. జెస్సోర్ రోడ్ నుంచి విమానబందర్ వరకు మెట్రోలో ప్రయాణించనున్న మోడీ.. బీహార్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించనున్న మోడీ.. గయా- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, వైశాలి, కొడర్మా రైలు సర్వీసులు ఆరంభించనున్న ప్రధాని..
* నేడు కేరళలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న అమిత్ షా..