నేడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి.. ఉదయం 11 గంటలకు రవీంద్రభారతీలో వేడుకలు.. ముఖ్య అతిధిగా పాల్గొననున్న సీఎం రేవంత్..
నేడు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మచే పుస్తకావిష్కరణ.. డాక్టర్ ఎంఎస్ గౌడ్ రచించిన మైల్స్ ఆఫ్ స్మైల్స్, మై లైఫ్ జర్నీ పుస్తకాన్నీ.. రాజ్ భవన్ లో ఆవిష్కరించనున్న జిష్ణు దేవ్ శర్మ..
నేడు ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉంటారు..
నేడు తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన..
నేడు నెల్లూరు నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి నారాయణ.
నేడు హైదరాబాద్ కు రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ.. రాత్రి 7 గంటలకు నానక్ రామ్ గూడలో సీఎల్పీ సమావేశం.. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ వేయనున్న అభిషేక్ సింఘ్వీ..
నేటి నుంచి మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి సప్త ఆరాధనోత్సవాలు ప్రారంభం.