Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story What Is The Cpi And Cpm Step In Huzurabad By Election

హుజూరాబాద్ లో కమ్యూనిస్టుల దారి ఎటువైపు?

Published Date :October 16, 2021 , 6:29 pm
By Manohar
హుజూరాబాద్ లో కమ్యూనిస్టుల దారి ఎటువైపు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలోని హుజూరాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ప్రచారంలో దూసుకెళుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీలని చెప్పుకునే సీపీఎం, సీపీఐ పార్టీలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు పార్టీల దుస్థితి చూస్తుంటే తెలంగాణలో ఈ పార్టీల భవిష్యత్ ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి.

రాజకీయంగా అత్యంత కీలకమైన హుజూరాబాద్ ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు క్యాడర్ ఉన్నప్పటికీ నాయకులు మాత్రం కరువైయ్యారు. ఈనేపథ్యంలో ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించలేదని తెలుస్తోంది. తాము ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది కూడా ఇప్పటివరకు ఆ రెండు పార్టీలు తేల్చుకోలేకపోవడం విడ్డూరంగా మారింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని మాత్రం స్పష్టం చేస్తున్నాయి.

బీజేపీ మతతత్వ పార్టీ అనే కారణంగా వారికి మద్దతు ఇవ్వడం లేదని కామ్రేడ్లు చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ విషయంలో మాత్రం కామ్రేడ్లు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయమని సీపీఎం, సీపీఐ తమ క్యాడర్ కు సూచనలు చేస్తున్నాయి. అయితే ఏ పార్టీకి అనుకూలంగా ఉండాలో కామ్రేడ్లు ప్రకటించకపోవడం విడ్డూరంగా మారింది. ఈ పరిణామం క్యాడర్లో అయోమయానికి కారణం అవుతోంది.  

ఇదే సమయంలో సీపీఎం మాత్రం స్థానిక నాయకత్వానికే నిర్ణయాన్ని వదిలేసింది. సీపీఐ మాత్రం కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటామని చెబుతుండం విశేషం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి ప్రజా పోరాటాలు చేస్తున్న కామ్రేడ్లు ఎన్నికల విషయంలో మాత్రం కప్పదాటు విధానాన్ని అవలంభిస్తున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో అంటకాగే కామ్రేడ్లు ఈ ఎన్నికలో మాత్రం వారికి మద్దతు ఇచ్చే అంశంపై మాట్లాడం లేదు. ఏ పార్టీతో కలిసి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు వస్తుందోననే ఆందోళన ఆపార్టీ నేతల్లో కన్పిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్రంలో కామ్రేడ్ల దుస్థితిని మరోసారి తేటతెల్లం చేసిందనే టాక్ విన్పిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cpi
  • CPM
  • huzurabad
  • huzurabad by election
  • telangana

తాజావార్తలు

  • MI Captaincy: “సూర్యను కెప్టెన్ చేయకపోతే హార్దిక్‌కు కష్టాలు తప్పవు”.. దిగ్గజ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు!

  • India Lok Sabha Seats Increase: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. 2029 ఎన్నికల నుంచే అమలు, తెలంగాణలో ఎన్ని పెరుగుతాయంటే?

  • AI+ Nova 2 Ultra 5G: ఏఐ+ నోవా 2 అల్ట్రా 5జీ నోటిఫికేషన్ రింగ్ లైట్ ఫీచర్‌ తో.. రిలీజ్ కు రెడీ..

  • Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్

  • Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం తప్పదు!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions