విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో భారత జట్టు కు కెప్టెన్ గా తప్పుకొని వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పుకోవడంతోనే అతడిని వన్డే ఫార్మాట్ నుండి కూడా కెప్టెన్ తొలగించాలి అనే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండవ వారంలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనతో వన్డే కెప్టెన్ గా కోహ్లీ భవిష్యత్తు తేలనునట్లు తెలుస్తుంది. అయితే ఈ పర్యటనలో టీం ఇండియా మూడు ఫార్మాట్ లలో సిరీస్ లు ఆడనుంది. ఈ సిరీస్ లకు జట్టును ఎంపిక చేసే సమయంలో కోహ్లీని వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉంచితే అతనే.. కొనసాగుతాడని లేదంటే అది కూడా రోహిత్ చేతికి వెళ్ళిపోతుందని తేలుస్తుంది.
అయితే దీనికి సంబంధించిన చర్చలో ముఖ్యంగా రెండు విషయాలు పైకి వస్తున్నాయి. అదేంటంటే… 2023 లో భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ కు సమయం తక్కువగా ఉండటంతో కోహ్లీనే కెప్టెన్ గా ఉంచాలి అని ఒక అంశం వస్తుంటే… ఆ ప్రపంచ కప్ కు సమయం తక్కువగా ఉండటంతోనే ఓ బలమైన జట్టును తాయారు చేయడానికి ఇప్పుడే రోహిత్ కు ఆ కెప్టెన్సీ పగ్గాలు అందించాలని.. ఇంకా ఆలస్యం చేస్తే కష్టం అవుతుంది అని చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి బీసీసీఐ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది.