జాతీయ‌ర‌హ‌దారుల‌పై ర‌న్‌వేలు… ఇదే కార‌ణం…

పౌర‌విమానాలు లేదా యుద్ద‌విమానాలు ల్యాండింగ్ కావాలంటే ప్ర‌త్యేక‌మైన ర‌న్‌వేలు ఉండాలి.  మాములు రోడ్డుపై విమానాలు దిగ‌లేవు.  ఒక‌వేళ యుద్ద‌స‌మ‌యంలో కావొచ్చు లేదా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎదురైన‌పుడు కావొచ్చు సైన్యాన్ని వివిధ ప్రాంతాల‌కు వేగంగా త‌ర‌లించాలి అంటే అత్య‌వ‌స‌ర ర‌న్‌వే వ్య‌వ‌స్థ‌లు అవ‌సరం అవుతుంటాయి.  దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని జాతీయ ర‌హ‌దారులను యుద్ద‌విమానాలు ల్యాండింగ్ కు అనుకూలంగా మార్చేందుకు ప్ర‌ణాళిక‌లు వేసింది.  

Read: అమెరికా తైవాన్‌కు స‌పోర్ట్ చేయ‌డం వెనుక అస‌లు కార‌ణం ఇదేనా…?

ఇప్పటికే రాజ‌స్థాన్‌లోని ఓ జాతీయ ర‌హ‌దారిపై యుద్ద‌విమానాలు దిగేందుకు అనుకూలంగా ర‌న్‌వేను ఏర్పాటు చేసింది.  కొన్ని నెల‌ల క్రితం యుద్ద‌విమానాల‌ను విజ‌య‌వంతంగా ల్యాండింగ్ చేశారు.  అదేవిధంగా యుద్ద‌సామాగ్రి, సైనికుల‌ను త‌ర‌లించే సీ 30 ర‌కం విమానాల‌ను కూడా ల్యాండింగ్ చేశారు.  అటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని య‌మునా ఎక్స్‌ప్రెస్ హైవే పై కూడా కొన్ని చోట్ల రోడ్డును ల్యాండింగ్‌కు అనుకూలంగా మార్చారు.  

Read: యువ‌కుడి క‌ల నెర‌వేర్చిన ఆనంద్ మ‌హీంద్రా…నెటిజ‌న్లు ఫిదా…

కాగా యూపీలోని పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ హైవేపై 3 కిలోమీట‌ర్ల మేర ర‌న్‌వేను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.  2018లో ఈ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేప‌ట్టి మూడేళ్ల కాలంలో 340.8 కిలోమీట‌ర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు.  సుల్తాన్‌పూర్ జిల్లాలో మూడు కిలోమీట‌ర్ల మేర ర‌న్‌వేను ఏర్పాటు చేశారు.  నిన్న‌టి రోజున ఈ ఎక్స్‌ప్రెస్ వే ను ప్ర‌ధాని ప్రారంభించారు.  దేశంలోని వివిధ జాతీయ ర‌హ‌దారుపై ఇలాంటి ర‌న్‌వేల‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ది.  

Related Articles

Latest Articles