Vande Bharat Express: ఎద్దును ఢీకొట్టిన వందే భారత్.. రైలుకు మళ్లీ డ్యామేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు తరుచూ చిన్న చిన్న ప్రమాదాలకు కేంద్రబిందువు అవుతోంది. ఇప్పటికే గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ఈ రైలు ప్రమాదాల బారిన పడింది. తాజాగా తెలంగాణలోని ఖమ్మంలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ వద్దకు రాగానే ట్రాక్‌పైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.కొన్ని నిమిషాల పాటు రైలును అక్కడే నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. మరమ్మతు పనులు పూర్తయిన తరువాత విశాఖపట్నానికి పంపిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బంది మరమ్మతులు చేయగా, 25 నిమిషాల ఆలస్యంగా రైలు బయలుదేరి వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకోవాల్సి ఉంది.
Also Read:Pigs Death: ఏపీలో అంతుచిక్కని వ్యాధి.. వెయ్యికిపైగా పందులు మృతి!
కాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ గేదెలు, పశువుల మందను ఢికొట్టడం ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా వందేభారత్ రైలు ప్రమాదానికి గురయింది. గుజరాత్ లో పట్టాలపైకి వచ్చిన పశువుల మందను ఢీకొట్టింది. దీనితో ముందు రైలు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ముందుభాగం మొత్తం ఊడి చేతికొచ్చింది. ప్రతీసారి ట్రాక్ పైకి పశువుల మందలు రావడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
Also Read:Revanth Reddy: నిజామాబాద్ జిల్లాలోకి రేవంత్ పాదయాత్ర.. పూర్తి రూట్ మ్యాప్ ఇదే !
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. సంక్రాంతి పండుగ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. ఇక ఇదే దక్షిణాదిన రెండో ట్రైన్ కాగా.. తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది. ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్‌లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు చైర్ కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ – విశాఖ చైర్ కార్ టికెట్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా నిర్ణయించారు.
తాజావార్తలు
-
Puri Jagannadh: ప్రభాస్ పేరు చెప్పగానే బ్యాంకాక్ హాస్పిటల్లో వీఐపీ ట్రీట్మెంట్.. పూరి చెప్పిన ఆసక్తికర ఘటన
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్‌కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్‌ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!