సమంత విడాకులపై మౌనం వీడిన తండ్రి

గత శనివారం నుంచి సమంతకు సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఆసక్తిగా గమనిస్తున్నారు ప్రేక్షకులు. నాగ చైతన్య, సమంత తమ విడాకుల విషయమై సోషల్ మీడియాలో స్టేట్‌మెంట్‌లను పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ విషయం అక్కినేని అభిమానులు, సామ్ ఫ్యామిలీతో పాటు సినీ ప్రియులందరికీ భారీ షాక్ ఇచ్చింది. వాళ్ళు అలా ప్రకటించారో లేదో విడాకులకు అసలు కారణం ఏంటి ? అనే విషయంపై ఆరాలు తీయడం మొదలు పెట్టారు. మరికొంత మంది ఒకడుగు ముందుకేసి సామ్ డివోర్స్ కు కారణం ఇదే అంటూ చెప్పడం మొదలు పెట్టారు. అయితే అసలు కారణం ఏంటి అనే విషయం సామ్, చై ఇద్దరూ బయట పెట్టలేదు. ఇదిలా ఉండగా తాజాగా సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కుమార్తె, అల్లుడు విడిపోవడం గురించి స్పందించారు.

Read Also : విలక్షణ నటుడు వినోద్ ఖన్నా!

సాధారణంగా సమంత తల్లితండ్రులు ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆమె తండ్రి మౌనం వీడి విడాకుల మీద స్పందించారు.ఈ వార్త విన్నప్పటి నుండి తన మనస్సు శూన్యం అయిపోయిందని అన్నారు. త్వరలోనే పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు మిస్టర్ జోసెఫ్ ప్రభు తెలిపారు. విడాకుల నిర్ణయం తనకు షాక్ ఇచ్చినప్పటికీ. తన కూతురు నిర్ణయం గురించి ఆలోచించానని ఆయన అన్నారు. మరోవైపు సమంత అభిమానులు కూడా ఈ సమయంలో సామ్ కు సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 2017 లో నాగ చైతన్య, సమంత గోవాలో వివాహం చేసుకున్నారు.

ఇక విడాకుల విషయం ప్రకటించిన తరువాత చై వర్క్ మూడ్ లో పడిపోయాడు. కానీ సామ్ గచ్చిబౌలిలోని తన ఇంట్లో ఉంటోంది. ఇప్పుడు సామ్ కు తన పనిలో నిమగ్నం అయ్యేందుకు సిద్ధపడుతోందని టాక్. వార్తల ప్రకారం ఆమె ఇటీవల కొన్ని సినిమాలకు సంతకం చేసింది. ఆ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తుంది.

-Advertisement-సమంత విడాకులపై మౌనం వీడిన తండ్రి

Related Articles

Latest Articles