మహారాష్ట్రలోని నాగపూర్‌లోని యశోధరానగర్‌లో వరసగా వాహనాలు దొంగతనానికి గురవుతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరసగా ఫిర్యాదులు అందుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు ఈకేసులో నలుగురికి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 వాహనాలును రికవరి చేసేశారు. అయితే, పదో వాహనం గురించి సర్పరాజ్ అనే దొంగను ప్రశ్నించగా, అతను చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ అయ్యారు. చలి బాగా పెరిగిపోవడంతో బైక్‌కు నిప్పు అంటించి చలికాసుకున్నామని చెప్పాడు. దొంగచెప్పన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. నలుగురు దొంగలపై కేసులు నమోదు చేశారు. దీనిని ఖరీదైన చలిమంటగా పోలీసులు పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న దొంగలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు పేర్కొన్నారు.
Read: ఒమిక్రాన్ టెన్షన్: ఢిల్లీ, ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు…