1947లో భారతదేశం, పాకిస్థాన్ విడిపోయిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భారత్ నుంచి పాక్‌కు వెళ్లారు. పాక్ నుంచి కూడా లక్షలాది మంది భారత్ కు వచ్చాయి. అయితే కొంత మంది మాత్రం తమ ఇళ్లను, ఊరిని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ప్రస్తుతం మన దేశంలో నివసిస్తున్న ముస్లింలు అందరూ భారత్‌ను విడిచి పెట్టి వెళ్లలేక ఇక్కడే ఉన్నారు. పాకిస్థాన్‌లోని హిందులు మాత్రం దాదాపు అందరూ తిరిగి వచ్చారు. కానీ.. ఓ కుటుంబం మాత్రం అక్కడే ఉండిపోయింది. అదే ఉమర్‌కోట్ హిందూ రాజు రాణా అర్జున్ సింగ్ రాజా కుటుంబం. విభజన తర్వాత కూడా ఆయన పాకిస్థాన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వీళ్లది రాజా కుటుంబం. అమర్‌కోట్ అనే రాజ్యాన్ని పాలించారు. ప్రస్తుతం ఇది ఉమర్‌కోట్‌గా మార్చబడింది.
READ MORE: Gopinchand ” నిర్మాతలను రిపీట్ చేస్తోన్న మ్యాచో స్టార్
ప్రసిద్ధి చెందిన ఉమర్‌కోట్ కోటలో మొఘల్ చక్రవర్తి అక్బర్ జన్మించారని చరిత్ర చెబుతోంది. ఈ కోటను హిందూ రాజు అర్జున్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు. అర్జున్ సింగ్ కొడుకు రాణా చందర్ సింగ్ పాలించారు. రాణా హమీర్ సింగ్ పాకిస్థాన్‌లోని ఉమర్‌కోట్‌కు చెందిన రాణా చందర్ సింగ్ కుమారుడు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్ పాకిస్థాన్ హిందూ పార్టీని నెలకొల్పారు. ఓం, త్రిశూలం గుర్తులతో కాషాయ జెండాని పార్టీ జెండాగా రూపొందించారు.
READ MORE: PSR Anjaneyulu: పీఎస్‌ఆర్ ఆంజనేయులను కస్టడీకి తీసుకున్న సీఐడీ!
రాణా చంద్ర సింగ్ బహిరంగ సభలు నిర్వహించినప్పుడు.. పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేవారని చెబుతారు. ఆయన ఏదైన ఓ ప్రకటన చేస్తే పాకిస్థాన్ ప్రభుత్వాన్ని భయబ్రాంతులకు గురి చేసేదట. కానీ.. ఈ పార్టీ పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ కాలేదు. తిరిగి ఆల్-ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు. ఏ పార్టీలో ఉన్న.. హిందూ టైగర్‌లో బతికే వారు. ఎవ్వరికీ భయపడలేదు. 2009లో ఆయన మరణించిన తర్వాత. పెద్ద కుమారుడు రాణా హమీర్ సింగ్ సోధా పాకిస్థాన్‌లో వారసుడిగా కొనసాగుతున్నారు.
READ MORE: SubhamTrailer : సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘శుభం’ ట్రైలర్ రిలీజ్
అర్జున్ సింగ్, చంద్ర సింగ్ ఏ కాదు.. వాళ్ల వారసుడు రాణా హమీర్ సింగ్ కూడా పాక్‌లో హిందూ టైగర్‌గా పేరు గాంచారు. పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని ఏకైక హిందూ పాలకుడు రాణా హమీర్ సింగ్. ఇప్పటికీ ముస్లిం దేశం పాకిస్థాన్‌లో రాయల్ జీవితాన్ని గడుపుతున్నారు. ఓ సారి పాకిస్థాన్ ప్రధానమంత్రికి బహిరంగంగా యుద్ధ సవాలు విసిరారు. రాణా హమీర్ సింగ్.. తలపై కాషాయ తలపాగా, నుదిటిపై తిలకం ధరించి ధీమాగా జీవిస్తున్నారు. పాకిస్థాన్‌లోని ధాటా అని కూడా పిలువబడే సింధ్‌లోని 22000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. 53 ఏళ్ల హమీర్ సింగ్, దివంగత పాకిస్థాన్ ప్రధాన మంత్రి బెనజీర్ భుట్టో రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు.. శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ శాఖలను మంత్రిగా పని చేశారు. సింగ్ మూడుసార్లు సింధ్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగారు. రాణా హమీర్ సింగ్ పాకిస్థానీ హిందువుల అభ్యున్నతి కోసం కృషి చేశారు. 2023 వరకు కూడా పదిలో ఉన్నారు. ఆల్-ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో కొనసాగారు. కాగా.. రానా హమీర్ సింగ్ కుమారుడు కర్ణి సింగ్ సోధా 20 ఫిబ్రవరి 2015న జైపూర్‌కి చెందిన పద్మిని రాథోడ్‌తో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.