Asian Champions Trophy: ఫైనల్‌కు చేరిన భారత హాకీ జట్టు.. దక్షిణ కొరియాపై 4-1 తేడాతో గెలుపు
- ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరిన భారత్
- సెమీస్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో భారత్ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ-ఫైనల్స్‌లో దక్షిణ కొరియాను 4-1తో ఓడించింది. ఫైనల్లో భారత్ చైనాతో తలపడనుంది. కాగా.. ఈ టోర్నీలో ఇండియా అద్భుత ప్రదర్శన చేసి అజేయంగా నిలిచింది. రేపు (మంగళవారం) భారత్-చైనాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తోంది. కాగా.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఉత్తమ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు.
Read Also: Ram Charan RC 16: బీస్ట్ మోడ్ ఆన్.. చరణ్ ఆన్ ఫైర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దక్షిణ కొరియాపై భారత్ ఆరంభంలోనే ఆధిక్యం కనబరిచింది. మొదట ఉత్తమ్ సింగ్ గోల్ చేసి భారత్‌ను 1-0తో ముందంజలో ఉంచాడు. ఆ తర్వాత.. రెండో క్వార్టర్లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్లో భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేశాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ దక్షిణ కొరియాపై 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత పురుషుల హాకీ జట్టు మూడో క్వార్టర్లోనూ ఆధిక్యాన్ని కొనసాగించింది. దక్షిణ కొరియా హాఫ్ టైమ్ తర్వాత పునరాగమనం చేసి గోల్ కొట్టే ప్రయత్నం చేసినా భారత్‌ను అధిగమించలేకపోయింది. మూడో క్వార్టర్లో కొరియా తరఫున జిహున్ యాంగ్ గోల్ చేయగా, భారత్ తరఫున జర్మన్‌ప్రీత్ సింగ్ మూడో గోల్ చేశాడు. ఆ తరువాత, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండవ గోల్ చేశాడు. దీంతో.. దక్షిణ కొరియాపై భారత్ 4-1 ఆధిక్యంలో నిలిచింది. దక్షిణ కొరియా చివరి వరకు ఆధిక్యం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు.
Read Also: Jani Master : పరారీలో జానీ మాస్టర్.. బాధిత మహిళ కూడా? ఏ క్షణమైనా అరెస్ట్??
అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ తలపడడం ఇది 62వ సారి. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో ఇరు జట్లు తొలిసారి తలపడ్డాయి. ఆ తర్వాత భారత్ 2-1తో దక్షిణ కొరియాను ఓడించింది. ఇప్పటి వరకు భారత్ 39 మ్యాచ్‌లు, దక్షిణ కొరియా 11 మ్యాచ్‌లు గెలుపొందాయి.. 12 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..