వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా వుందన్నారు. ఇది స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి కళ. రామలింగన్న కోరిక.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వరం దుబ్బాక లో వందపడకల ఆసుపత్రి. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబ్బాక మీద చాలా ప్రేమ వుందన్నారు.
దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తే ముఖ్యమంత్రి సంతోషిస్తాడు. స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో కాని పనులు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేసుకుంటున్నాం. 70 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో ఆసుపత్రులు కుంటుపడితే.. ఇవ్వాళ టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు హరీష్ రావు. వైద్య రంగంలో భారత దేశానికే ఆదర్శంగా తెలంగాణ ముందుకు వెళుతోందన్నారు. 18 ఏండ్లు దాటిన వారు వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు.
ఒమిక్రాన్ వైరస్ పేరు చెబితే అంతా గజగజ వణుకుతున్నారు. అది పోవాలంటే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. కేంద్రం నుంచి పర్మిషన్ వస్తే మూడో డోస్ వేసుకుందాం అన్నారు. వ్యాక్సిన్ పై అనుమానం, అపోహలు పెట్టుకోవద్దని హరీష్ రావు హితవు పలికారు.