కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా ఎటాక్ చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… తెలంగాణ రాష్ట్రంలోనూ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కేసులు భారీగా వెలుగు చూశాయి.. అయితే, ఒమిక్రాన్ ముప్పు త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కొత్త వేరియంట్‌పై మరోసారి స్పందించిన ఆయన.. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఇక, 325 మంది విదేశీ ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగింది.. అందులో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిందని.. టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం.. జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించామని వెల్లడించారు.
Read Also: వరి ఉరి కాదు.. రైతుల పాలిట సిరి..
ఒమిక్రాన్ ముప్పు త్వరలో వచ్చే ప్రమాదం ఉంది.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు… కొత్త వేరియంట్, విస్తరణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మూడు గంటల పాటు చర్చించినట్టు తెలిపిన ఆయన.. సర్వేలేన్స్ సిస్టం, ఆస్పత్రుల్లో వసతులపై దృష్టిసారించామన్నారు.. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ మూడు రోజుల్లోనే మూడు దేశాల నుంచి 24 దేశాలకు వ్యాప్తి చెందిందన్నారు. సౌతాఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్టు నిపుణులు చెబుతున్నారని గుర్తుచేశారు.. రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 239 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం.. రేపో మాపో మన దేశానికి కూడా ఒమిక్రాన్ వచ్చే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.