ట్రెండ్ సెట్టర్ సీఎం కేసీఆర్.. ఒకే నినాదంతో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేం ట్రెండును ఫాలో అవ్వం.. సెట్ చేస్తాం.. అంటూ ఓ సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబుతారు.. ఇది సరిగ్గా సరిపోయే వ్యక్తం ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం, గులాబీ దళపతి కె.చంద్రశేఖర్ రావే.. తెలంగాణ రాజకీయాల్లో గత రెండు దశాబ్దాలుగా అయనే ట్రెండ్ సెట్టర్. అయన ఏం చేసినా వినూత్నమే… మెదట అసాధ్యం అనిపించేలా అయన పథకాలుంటాయి.. తర్వాత అందరు ఫాలో అయ్యేలా రిజల్ట్ ఉంటుంది. పరిపాలనలో అయినా రాజకీయాల్లో అయినా… తాజాగా అన్నిపార్టీలు జై భీమ్ నినాదం ఎత్తుకునేలా ఎత్తులు వేసి విజయం సాధించారు కేసీఆర్. జై భీమ్ నినాదం కొత్త కాదు.. కానీ, దళితబంధు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ జై భీమ్, జై తెలంగాణ అంటూ నినదించడం పెద్ద చర్చగా మారిపోయింది.
ఇక, కేసీఆర్ 2001లో తెలంగాణ నినాదం ఎత్తుకున్నప్పుడు అంతా రాజకీయ పబ్బం కొసం కొత్త వేదిక అనుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కూడా లైట్ తీసుకుంది తెలంగాణ ఉద్యమాన్ని… కాని కొద్ది రోజులకే అన్ని పార్టీలు తెలంగాణ అంశాన్ని తమ ఎజెండాలో పెట్టుకునే దశకు తీసుకెళ్లారు ఉద్యమనేత కేసీఆర్. పార్టీలకతీతంగా నేతంలందరితో జై తెలంగాణ అనిపించారు. 24 గంటల ఉచిత కరెంట్‌ను అన్నప్పుడు ఇది అసాధ్యం అన్నవాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ పరిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గత ఏడేళ్లుగా కరెంటు అందింస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరెంటు పేరుతో ఉధ్యమాలు జరిగిన తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ అంశం కరంట్ టాపిక్‌లో లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు విద్యుత్ విషయంలో కేసీఆర్‌ను ఫాలో అయ్యాయి.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్‌డౌన్‌పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
మరోవైపు దేశంలోనే సంచలనంగా మారిన రైతుబంధు పథకంలో ఖచ్చితంగా కేసీఆర్ ట్రెండ్ సెట్టర్. ఎకరాకు పదివేలు ఇవ్వడం సాధ్యంకాని పనంటూ కొట్టిపారేసిన వాళ్లంతా నోర్లు వెల్లబెట్టుకునేలా రైతు బంధు అమలుచేస్తున్నారు. అంతేకాదు రైతు బంధును అధ్యయనం చేసి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలే కాదు…ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా రైతు పెట్టుబడి సాయాన్ని అమలుచేస్తుంది. దళిత బంధు కూడా కేసీఆర్ ప్రవేశపెట్టిన మరో సంచలన పథకమే… దళిత బంధు కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు ఇదొక ఉద్యమం అంటూ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ జై భీమ్ అనడంతో అటు ప్రతిపక్షాలు కూడా ఆ నినాదాన్ని ఎత్తుకున్నాయి. కాంగ్రెస్ దళిత దండోరా ప్రకటించింది. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అదే ఎజెండాతో బీఎస్సీలో చేరారు. బీజేపీ కూడా దళిత సంక్షేమంపై అంశాల వారిగా ఎజెండా రూపొందించుకుంటుంది. ఇలా తెలంగాణలో రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని జై భీమ్ బాట పట్టించారు కేసీఆర్.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..