Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Public Charging: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ప్రయాణాల సమయంలో ఫోన్ బ్యాటరీ – లో అయితే వెంటనే ఛార్జింగ్ కోసం చాలా మంది విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, కేఫ్‌లలో అందుబాటులో ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో హ్యాకర్లు తమ పరికరాలను అమర్చే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు మీ ఫోన్‌ను అలాంటి ఛార్జింగ్ పోర్ట్‌కు కనెక్ట్ చేసినప్పుడు, మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు లేదా ఇతర సున్నితమైన డేటాను దొంగిలించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఫోన్లోకి వైరస్లు పంపించి హ్యాకింగ్ లేదా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొంటున్నారు.
సాధారణంగా మనం ఉపయోగించే USB కేబుల్ కేవలం బ్యాటరీ ఛార్జింగ్‌కే కాకుండా డేటా బదిలీకి కూడా ఉపయోగపడుతుంది. దీంతో పబ్లిక్ USB పోర్ట్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లోని సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీనినే “జ్యూస్ జాకింగ్” (Juice Jacking) అనే సైబర్ మోసంగా పిలుస్తారని వెల్లడించారు. మీరు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లో ఫోన్ పెట్టిన తర్వాత “ఈ పరికరాన్ని అనుమతించాలా?” లేదా డేటా యాక్సెస్‌కు సంబంధించిన ఏదైనా పాప్అప్ కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. తెలియని పరికరాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. అలా చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు. మీ ట్రావెలింగ్ టైంలో మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం అని అంటున్నారు. ఎప్పుడూ మీ సొంత ఛార్జర్, USB కేబుల్‌ను వెంట తీసుకెళ్లడం మంచిదని, వీలైనంత వరకు నేరుగా ఛార్జింగ్ చేసుకోవడం మంచి పద్ధతని అంటున్నారు. అలాగే ముందుగానే పవర్ బ్యాంక్‌ను ఛార్జ్ చేసి వెంట తీసుకెళ్లడం ద్వారా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా డేటా దొంగతనం, బ్యాంక్ మోసాలు వంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
Also Read
- OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
- Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
- Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!