MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ తన సుదీర్ఘ ఐపీఎల్ ఆటగాడి ప్రయాణానికి ముగింపు పలికారు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై జట్టుకు వెన్నెముకగా నిలిచిన ‘తలా’, ఇకపై మైదానంలో బ్యాట్, గ్లవ్స్‌తో కనిపించకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే అయినా, ఆయన జట్టుతోనే కొనసాగనుండటం ఊరటనిస్తోంది.
ఐపీఎల్ 2027 రిటెన్షన్ గడువు ముగిసే రోజైన నవంబర్ 17, 2026న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ కీలక ప్రకటన చేసింది. ధోనీకి జట్టు ‘టీమ్ మెంటార్’ బాధ్యతలు అప్పగిస్తున్నామంటూ సీఎస్కే అధికారిక పోస్ట్ పెట్టింది. జట్టు ప్రారంభమైనప్పటి నుంచి ధోనీ CSK ప్రయాణంలో అత్యంత కీలక భాగంగా ఉన్నారని, ఫ్రాంచైజీ ఎన్నో విజయాలు సాధించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఎన్నో కష్టకాలాల్లోనూ ధోనీ జట్టుకు అండగా నిలిచారని గుర్తుచేస్తూ, ధోనీతో CSKకి ఉన్న అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇకపై డగౌట్ నుంచి యువ ఆటగాళ్లకు మార్గదర్శకత్వం చేయనున్న ధోనీ, కొత్త తరం సూపర్ కింగ్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో తన అపార అనుభవాన్ని పంచుకోనున్నారు. ధోనీ ఎప్పటికీ CSK గుర్తింపులో భాగంగానే ఉంటారని, చెన్నై నగరం ఎప్పటికీ ఆయనకు సొంత ఇల్లులాంటిదని ఫ్రాంచైజీ భావోద్వేగంగా వెల్లడించింది.
Also Read
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
- క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
- Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
ధోనీ ఐపీఎల్ ప్రస్థానం చరిత్రలో నిలిచిపోయేది. 2008లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, 2008 నుంచి 2015 వరకు వరుసగా 8 సీజన్ల పాటు CSK తరఫున ఆడారు. ఆ తర్వాత 2016, 2017 సీజన్లలో CSKపై నిషేధం విధించబడిన కారణంగా ధోనీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. నిషేధం ముగిసిన అనంతరం 2018లో మళ్లీ తన సొంత గూటికి చేరుకున్న ధోనీ, 2018 నుంచి 2026 వరకు CSKతోనే కొనసాగారు. 2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 45 ఏళ్ల ధోనీ, పిక్క గాయం (calf injury) కారణంగా గత 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. వరుస గాయాలు, వయసు రీత్యా ఆటగాడిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
తన కెప్టెన్సీలో సీఎస్కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించిన ధోనీ, జట్టు తరఫున అత్యధికంగా 272 మ్యాచ్‌లు ఆడి 5,314 పరుగులు సాధించారు. ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంతో రాబోయే ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ పర్సులో అదనంగా రూ. 4 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోలేమని ఫ్రాంచైజీ యజమాని ఎన్. శ్రీనివాసన్ పేర్కొనగా, యువ ఆటగాళ్లున్న జట్టుకు ధోనీ అనుభవం ఎంతో కీలకమని సహ-యజమాని రూప గురునాథ్ అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
MS Dhoni: IPLకు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోని.. గురువుగా సరికొత్త అవతారం..
-
GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
-
Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
-
Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..