కరోనా కారణంగా ఎక్కడ వ్యక్తులు అక్కడే ఆగిపోయారు. కరోనా మహామ్మారి కారణంగా పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. నిత్యం పర్యాటకులతో కలకలలాడే థాయ్‌ల్యాండ్ ఇప్పుడు బోసిపోయింది. కరోనా కారణంగా ఆ దేశానికి వచ్చేందుకు పర్యాటకులు ఆలోచిస్తున్నారు. రోడ్లపై నిత్యం పరుగులు తీసే క్యాబ్‌లు షెడ్డుకే పరిమితం అయ్యాయి. షెడ్డుకే పరిమితమైన క్యాబ్‌లపై గార్డెన్ ను పెంచాలని క్యాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. క్యాబ్‌లపై వెదురుకర్రలతో ఒక చిన్న తొట్టిలాగా ఏర్పాటు చేసి అందులో మట్టి వేసి వివిధ రకాల కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. దాదాపు 250 క్యాబ్‌లపై ఇలాంటి రూఫ్ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ ఇప్పుడు ఆకట్టుకుంటున్నది. తమ ఇబ్బందులు తెలియజేసేందుకే ఈ విధంగా చేసినట్టు క్యాబ్ యాజమాన్యం పేర్కొన్నది.