వినాయక చవితి వచ్చింది అంటే దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గణపయ్యలను తయారు చేసి వాటికి అంగరంగవైభవంగా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలు నిర్వహించి నిమర్జనం చేస్తారు. హిందువుల తొలి పండుగ కావడంతో ప్రధాన్యత ఉంటుంది. ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో ఓ బోజ్జగణపయ్యలకు దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా జపాన్‌లో ఉన్న వినాయక మందిరం వెరీ స్పెషల్‌గా ఉంటుంది. జపాన్‌లోని గణపతిని కాంగిటెన్ అని పిలుస్తారు. జపాన్ రాజధాని టోక్యోలోని అతి పురాతన బౌద్ద దేవాలంలో కాంగిటెన్ వినాయకుడి దేవాలయం ఉన్నది. ఇక్కడ దేవాలయంలో గణపతి ఆడఏనుగును ఆలింగనం చేసుకున్నట్టుగా విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటున్నది. ఇక్కడ విగ్రహాలను పెట్టెలలో ఉంచి పూజిస్తారు. ఉత్సవాల రోజున విగ్రహాన్ని పెట్టె నుంచి బయటకు తీసి పూజలు నిర్వహిస్తారు.
Read: వారు ఎప్పటికీ మారరు…మహిళలపై వారి అభిప్రాయం మారదు…