వారు ఎప్ప‌టికీ మార‌రు…మ‌హిళ‌లపై వారి అభిప్రాయం మార‌దు…

తాలిబ‌న్లు ఎలాంటి వారో అంద‌రికీ తెలుసు.  తాలిబ‌న్లు చెప్పేది ఒక‌టి చేసేది మ‌రోక‌టి అనే విష‌యం అంద‌రికీ తెలుసు.  ఆఫ్ఘనిస్తాన్‌ను అక్ర‌మించుకున్నాక అంద‌రిని స‌మానంగా చూస్తామ‌ని, ఎవ‌రికీ ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌బోమ‌ని హామీ ఇచ్చారు.  హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ దానిని నిల‌బెట్టుకుంటారు అని ఎవ‌రికీ న‌మ్మ‌కం లేదు.  అందుకే తాలిబ‌న్లు ఆఫ్ఘ‌న్‌ను ఆక్ర‌మించుకున్న‌ప్ప‌టి నుంచి మ‌హిళ‌లు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.  అంద‌రికీ కేబినెట్‌లో స‌మానంగా అవ‌కాశాలు ఇస్తామ‌ని చెప్పిన తాలిబ‌న్లు ఒక్క మ‌హిళ‌కు కుడా అవ‌కాశం క‌ల్పించ‌లేదు.  పైగా మ‌హిళ‌ల ప‌ట్ల వారికున్న అభిప్రాయాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.  మ‌హిళ‌లు ఉన్న‌ది ఇంట్లో ఉండి పిల్ల‌ల్ని క‌న‌డానికి మాత్ర‌మే అని, కేబినెట్ లో కూర్చోని ప‌రిపాల‌న సాగించ‌డానికి, ఉద్యోగాలు చేయ‌డానికి కాద‌ని అన్నారు.  వారి మాట‌ల‌ను బట్టి ఆఫ్ఘ‌నిస్తాన్‌లో రెండు ద‌శాబ్దాల క్రితం సాగించిన ప‌రిపాల‌న మ‌రోసారి పున‌రావృతం కాబోతుంద‌ని అర్ధం అవుతున్న‌ది.  

Read: సామ్ జీవితంలోకి కొత్త అతిథి… ఇబ్బందే అంటోన్న బ్యూటీ !

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-